BJP: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలమైన శక్తిగా ఎదగనుంది: కన్నా లక్ష్మీనారాయణ

  • పార్టీలో చేరిన ఎంపీలకు అభినందనలు
  • వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం
  • దేశాభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యం
ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోనే ఈ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించనుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు నిన్న పార్టీలో చేరిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. ప్రధాని పనితీరుకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వారికి అభినందనలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
BJP
Telugudesam MP's
kanna lakshminarayana

More Telugu News