యోగా చేస్తే ఆనందం.. ఆరోగ్యం: నరేంద్ర మోదీ
- నేడు వరల్డ్ యోగా డే
- రాంచీలో ప్రత్యేక కార్యక్రమాలు
- పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచం యావత్తూ నేడు ఐదో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోందని గుర్తు చేసిన మోదీ, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఎన్నో దేశాల్లోని ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నారని, వారి జీవితాల్లో శాంతి అనుభూతి పెరిగిందని అన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని మరింత విస్తరించడం ద్వారా మెరుగైన సేవలను అందిస్తామని అన్నారు.