Yoga Day: యోగా చేస్తే ఆనందం.. ఆరోగ్యం: నరేంద్ర మోదీ

  • నేడు వరల్డ్ యోగా డే
  • రాంచీలో ప్రత్యేక కార్యక్రమాలు
  • పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ
నిత్యమూ యోగాను క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ లోని రాంచీలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొని ప్రసంగించారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని వ్యాఖ్యానించిన మోదీ, ఎన్నో దేశాలు యోగాను పాటిస్తున్నాయని గుర్తు చేశారు. రోగాలను శరీరం దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తుందని, అయితే, యోగాను చేసేటప్పుడు క్రమశిక్షణ, అంకితభావం తప్పనిసరని అన్నారు.

ప్రపంచం యావత్తూ నేడు ఐదో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోందని గుర్తు చేసిన మోదీ, ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఎన్నో దేశాల్లోని ప్రజలు యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నారని, వారి జీవితాల్లో శాంతి అనుభూతి పెరిగిందని అన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని మరింత విస్తరించడం ద్వారా మెరుగైన సేవలను అందిస్తామని అన్నారు.
Yoga Day
Narendra Modi
Ranchi
Yoga

More Telugu News