పార్టీని వీడిన ఎంపీలపై టీడీపీ నేతల మండిపాటు.. జీవీఎల్, విజయసాయిరెడ్డిలపై బుద్ధా వెంకన్న ప్రశంసలు!
- ఈ ఎంపీలు పిరికిపందల్లా వ్యవహరించారు: దేవినేని
- పార్టీ మారిన ఎంపీలు చచ్చు దద్దమ్మలు
- నమ్ముకున్న పార్టీల కోసం జీవీఎల్, విజయసాయిరెడ్డి నిలబడ్డారు: బుద్ధా
ఇదే విషయమై టీడీపీ మరో నేత దేవినేని ఉమ మాట్లాడుతూ, పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసిందని, ఈ ఎంపీలు మాత్రం పిరికిపందల్లా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఐడీ, ఈడీ కేసులకు భయపడి ఈ ఎంపీలు పార్టీని వీడారని, బీజేపీ కండువాలు కప్పుకున్నారని తూర్పారబట్టారు.