అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణ అమలు చేయండి: అధికారులకు సీఎం యోగి ఆదేశాలు
- అవినీతి అధికారుల పదోన్నతులు నిలిపివేయండి
- సచివాలయంలో ఇకపై బయో మెట్రిక్ విధానం
- అనుమతి లేకుండా సచివాలయంలోకి రానివ్వొద్దు
ఇకపై సచివాలయంలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా ఎవరినీ సచివాలయంలోకి అనుమతించవద్దని అధికారులకు యోగి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని యోగి అధికారులకు సూచించారు.