కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల తాగు నీరు అందుతుంది: కేటీఆర్
- కాళేశ్వరం కేసీఆర్ మానస పుత్రిక
- సాగు కోసం 16 టీఎంసీల నీరు అందుతుంది
- కాళేశ్వరంపై పాటను రీట్వీట్ చేసిన కేటీఆర్
‘‘తెలంగాణ జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రిక. దీని ద్వారా రాష్ట్రంలోని హైదరాబాద్‌తో పాటు ఎన్నో పట్టణాలు, గ్రామాలకు 40 టీఎంసీల తాగునీరు అందుతుంది. అలాగే సాగుతో పాటు పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీల నీరు అందుతుంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద రూపొందించిన ఒక పాటకు సంబంధించిన వీడియోను కూడా ఆయన రీట్వీట్ చేశారు.