Rahul Gandhi: సభలో ఓపక్క రాష్ట్రపతి ప్రసంగం.. మరోపక్క ఫోనుతో రాహుల్!

  • విమర్శలకు తావిచ్చేలా రాహుల్ ప్రవర్తన
  • బ్రౌజింగ్‌, ఏదో టైప్ చేస్తూ కనిపించిన రాహుల్
  • ఆసక్తిగా ప్రసంగాన్ని వింటూ కనిపించిన సోనియా
నేడు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం ఓపక్క కొనసాగుతుండగా, మరోపక్క రాహుల్ గాంధీ ఫోనులో బ్రౌజింగ్ చేస్తూ, పార్లమెంట్‌ను ఫొటోలు తీస్తూ కనిపించడం విమర్శలకు తావిస్తోంది.

గంటకు పైగా రాష్ట్రపతి ప్రసంగం సాగగా, రాహుల్ 24 నిమిషాల పాటు ఫోనులో బ్రౌజింగ్‌తో పాటు ఏదో టైప్ చేస్తూ, పార్లమెంటును ఫోటోలు తీస్తూ, తల్లితో మాట్లాడుతూ కనిపించారు. సోనియా గాంధీ మాత్రం చాలా ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. ఉరి, బాలాకోట్ దాడుల గురించి కోవింద్ మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రశంసించడం గమనార్హం. అయితే అలాంటి సమయంలో కూడా రాహుల్ ఇవేమీ పట్టనట్టుగా వ్యవహరించారు. దీంతో రాహుల్ వైపు సోనియా తదేకంగా చూసినా కూడా ఆయన అదేమీ పట్టించుకోలేదు.
Rahul Gandhi
Sonia Gandhi
Ramnath Kovind
Browsing
Parliament

More Telugu News