Jagan: పోలవరం ప్రాజక్టు అధికారులకు సరికొత్త టార్గెట్ లు ఫిక్స్ చేసిన సీఎం జగన్

  • 2021 కల్లా ప్రాజక్టు పూర్తిచేయాలని ఆదేశం
  • వచ్చే ఏడాదికి కాఫర్ డ్యామ్, స్పిల్ వే పనులు పూర్తవ్వాలని స్పష్టీకరణ
  • వచ్చే ఏడాది నుంచి గ్రావిటీతో నీళ్లు ఇచ్చేలా పనులు సాగాలన్న సీఎం
సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా పోలవరం ప్రాజక్టును సందర్శించారు. ఏరియల్ సర్వే ద్వారా ప్రాజక్టు పనులను పరిశీలించిన జగన్, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజక్టు అధికారులకు సరికొత్తగా లక్ష్యాలను నిర్దేశించారు. 2021 నాటికి పోలవరం ప్రాజక్టుకు సంబంధించి ఏ ఒక్క పనీ మిగిలిపోరాదని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో ఈసీఆర్ఎఫ్ సహా అన్ని పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. 2020 నాటికి కాఫర్ డ్యామ్, స్పిల్ వే పనులు మొత్తం పూర్తవ్వాలని సూచించారు. వచ్చే ఏడాది గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలిగేలా పనులు ముందుకుసాగాలని అధికారులకు చెప్పారు.
Jagan
Andhra Pradesh
Polavaram

More Telugu News