Andhra Pradesh: 'టీడీపీ ఎంపీల జంప్' వ్యవహారం.. కమలనాథులపై సన్నిహితుల వద్ద తీవ్రంగా మండిపడ్డ చంద్రబాబు!

  • నలుగురు ఎంపీలు పార్టీ మారుతారని వార్తలు
  • పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు ఫోన్
  • కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని ఆదేశం
టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేశ్ ఈరోజు బీజేపీలో చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈరోజు పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో ఆయన యూరప్ నుంచి ఫోన్ లో మాట్లాడారు. టీడీపీలో సంక్షోభాలు అన్నవి కొత్తవి కాదన్న చంద్రబాబు.. కార్యకర్తలు, నేతలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడామని బాబు గుర్తుచేశారు. 
Andhra Pradesh
BJP
Telugudesam
Chandrababu
angry

More Telugu News