Andhra Pradesh: 2024 నాటికి ఏపీలో టీడీపీ అనేది ఉండదు: విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • తెలంగాణలో పరిస్థితే ఏపీలో టీడీపీకి పడుతుంది
  • టీడీపీ కెప్టెన్ లేని షిప్ లాంటిది
  • మేము డోర్లు తెరిస్తే టీడీపీ అంతా బీజేపీలో ఉంటుంది
ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీని వీడనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, 2024 నాటికి ఏపీలో టీడీపీ అనే పార్టీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏవిధంగా అయితే టీడీపీ కనుమరుగైందో, ఏపీలో కూడా అదే పరిస్థితి ఆ పార్టీకి వస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ కెప్టెన్ లేని షిప్ లాంటిదని, తాము డోర్లు ఓపెన్ చేస్తే టీడీపీ అంతా బీజేపీలో ఉంటుందని అన్నారు. బాబు దుష్ప్రచారం చేసి బీజేపీని నాశనం చేశారని ఆయన ఆరోపించారు.

More Telugu News

Andhra Pradesh
Telugudesam
Chandrababu
bjp
vishnu