karate kalyani: 'ఆది' సినిమా నుంచి నా కెరియర్ మలుపు తిరిగింది: కరాటే కల్యాణి

  • విజయనగరం నుంచి వచ్చాను 
  • ఎవరి సపోర్టు దొరకలేదు
  •  ఇండస్ట్రీ నన్ను ఆదరించింది
కేరక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కల్యాణికి మంచి పేరుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరియర్ ను గురించి ప్రస్తావించింది. "నటన పట్ల ఆసక్తితో విజయనగరం నుంచి వచ్చాను. ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకపోవడం వలన ఎన్నో కష్టాలు పడ్డాను. ఎక్కడ ఉండాలో .. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులను ఎదుర్కొన్నాను.

అలాంటి పరిస్థితుల్లో వున్న నన్ను ఇండస్ట్రీ ఆదరించింది. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఇండస్ట్రీ. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఎవరైనా ఏమైనా అంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ముందుగా సీరియల్స్ చేసిన తరువాతనే నేను సినిమాల్లోకి వచ్చాను. 'ఆది' సినిమాలో నా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి నా కెరియర్ మలుపు తిరిగింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చింది.
karate kalyani

More Telugu News