Andhra Pradesh: మోదీ సార్.. అమ్మాయిలే లేనప్పుడు ‘బేటీ బచావో-బేటీ పడావో’ ఎలా సాధ్యం?: నటి రష్మీ గౌతమ్

  • వరంగల్ లో 9 నెలల చిన్నారి రేప్, హత్య
  • తీవ్రంగా స్పందించిన యాంకర్ రష్మీ గౌతమ్
  • అమ్మాయిలే లేకుంటే ఎలా అని ప్రశ్న
తెలంగాణలోని వరంగల్  లో 9 నెలల పసికందుపై ప్రవీణ్ అనే దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో రష్మి స్పందిస్తూ..‘నరేంద్ర మోదీ సార్.. మీరేమో బేటీ బచావో.. బేటీ పడావో(అమ్మాయిలను కాపాడండి.. అమ్మాయిలను చదివించండి) అంటున్నారు. కానీ అమ్మాయిలే మిగలకుంటే, బేటీ బచావో.. బేటీ పడావో ఎలా సాధ్యమవుతుంది’ అని ప్రశ్నించారు. కాగా, నిందితుడు ప్రవీణ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Telangana
Tollywood
Narendra Modi
rashmi gawtam

More Telugu News