Telugudesam: పార్లమెంటులో అస్వస్థతకు గురైన టీడీపీ ఎంపీ.. ఆసుపత్రికి తరలింపు

  • ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో అస్వస్థత
  • పడిపోయిన బీపీ లెవెల్స్ 
  • ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళుతున్న సమయంలో ఆయనకు బీపీ లెవెల్స్ పడిపోయాయి. దీంతో, తూలి కింద పడబోయారు. పక్కనే ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లు ఆయనకు సపర్యలు చేశారు. వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం అక్కడ నుంచి ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.
Telugudesam
mp
garikapati
ill

More Telugu News