viajyasai reddy: నా జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకం: విజయసాయిరెడ్డి

  • పార్లమెంటు ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం
  • విజయసాయిని ప్రత్యేకంగా పలకరించిన మోదీ
  • సంతోషాన్ని వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి
పార్లమెంటు లైబ్రరీ హాల్ సమీపంలో నిన్న ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ బయటకు వచ్చారు. ఈ సమావేశానికి పార్టీల అధ్యక్షులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేకపోవడంతో... వైసీపీ ఎంపీలంతా బయట ఉన్న లాంజ్ లో కూర్చున్నారు. మోదీ బయటకు వస్తుండడాన్ని చూసిన వైసీపీ ఎంపీలు గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డిని చూసిన మోదీ...  'హాయ్ విజయ్ గారూ' అంటూ ప్రత్యేకంగా పలకరించారు.
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి పంచుకున్నారు. జగన్ కోసం నిరీక్షిస్తున్న తనను చూసి... తన వైపు అడుగులు వేసి, తనతో మోదీ కరచాలనం చేశారని తెలిపారు. తన జీవితంలో ఇదొక మధుర జ్ఞాపకమని చెప్పారు.
viajyasai reddy
modi
shake hand
ysrcp
bjp

More Telugu News