Andhra Pradesh: బుచ్చిలింగం మరణం టీడీపీకి తీరని లోటు!: నారా లోకేశ్

  • టీడీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి లోకేశ్
  • టీడీపీ ఉన్నతికి ఆయన ఎంతగానో శ్రమించారని వ్యాఖ్య
తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం ఆకస్మిక మరణంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ గా బుచ్చిలింగం పార్టీ ఉన్నతికి ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. బుచ్చిలింగం ఆత్మకు శాంతి చేకురాలనీ, ఆయన కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Telangana
buchilingam
dead
Twitter
Nara Lokesh

More Telugu News