తమన్నా ప్రధాన పాత్రధారిగా 'రాజుగారి గది 3' లాంచ్
- ఓంకార్ నుంచి మరో హారర్ థ్రిల్లర్
- దిల్ రాజు చేతుల మీదుగా మొదలు
- రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్
కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. విభిన్నమైన కథాకథనాలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ సాగుతుందని ఓంకార్ అన్నాడు. తమన్నా జోడీగా అశ్విన్ బాబు కనిపించనున్నాడు. ఇటీవల హారర్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా చేసుకుంటూ వస్తోన్న తమన్నా, ఆ జాబితాలోకి ఈ సినిమాను కూడా చేర్చేసింది.