Eoin morgan: అలా బాదేస్తానని అనుకోలేదు: ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్

  • ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో విరుచుకుపడ్డ మోర్గాన్ 
  • 17 సిక్సర్లతో రికార్డు మోత
  • అన్ని సిక్సర్లు కొట్టడమంటే మాటలు కాదన్న మోర్గాన్  
ప్రపంచకప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన ఆటకు తనే ఆశ్చర్యపోతున్నాడు. అలా విధ్వంసం సృష్టిస్తానని తానెప్పూడూ అనుకోలేదన్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లడిన మోర్గాన్.. తాను అలా ఆడగలనని కలలో కూడా అనుకోలేదన్నాడు. అయితే, అలా ఆడినందుకు మాత్రం ఇప్పుడు సంతోషంగా ఉందన్నాడు. 17 సిక్సర్లు కొట్టడమంటే మాటలు కాదని, ఇది తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లండ్ చేసిన 397 పరుగులు ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు కాగా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా మోర్గాన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 71 బంతుల్లో 4 ఫోర్లు, 17 సిక్సర్లతో ఏకంగా 148 పరుగులు చేశాడు. ఆప్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 9 ఓవర్లు వేసి వికెట్ తీయకుండా 110 పరుగులు ఇచ్చాడు. ప్రపంచకప్‌లో ఇది అత్యంత చెత్త రికార్డు. 
Eoin morgan
England
Afghanistan
world cup

More Telugu News