Andhra Pradesh: ఒకే ఒక్క గన్‌మన్‌ను పంపిన ప్రభుత్వం.. వద్దని వెనక్కి పంపిన అచ్చెన్నాయుడు

  • నిన్నమొన్నటి వరకు 4+4 గన్‌మెన్ సౌకర్యం
  • 2+2కు కుదించిన ప్రభుత్వం
  • బుధవారం ఒక్కరినే పంపడంతో అసంతృప్తి
మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు పంపిన ఒకే ఒక్క గన్‌మన్‌ను వెనక్కి పంపారు. దీంతో బుధవారం ఆయన విజయవాడలో రోజంతా గన్‌మన్ లేకుండానే పర్యటించారు. నిజానికి అచ్చెన్నాయుడికి నిన్నమొన్నటి వరకు 4 ప్లస్ 4 గన్‌మెన్ సౌకర్యం ఉండేది.

అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం టీడీపీ నేతలకు భద్రతను కుదిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా అచ్చెన్న భద్రతను 2 ప్లస్ 2గా మార్చింది. మంగళవారం వరకు ఆయనకు 2 ప్లస్ 2 పద్ధతిలోనే గన్‌మెన్ ఉన్నారు. అయితే, బుధవారం ఒకే ఒక్క గన్‌మన్‌ను ప్రభుత్వం అచ్చెన్న వద్దకు పంపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన మాజీ మంత్రి తనకు గన్‌మన్ అవసరం లేదని అతడిని వెనక్కి పంపారు.  
Andhra Pradesh
atchannaidu
Gunmen
YSRCP

More Telugu News