Andhra Pradesh: జగన్, చంద్రబాబుల పీఎస్ లు మాట్లాడినట్టుగా నమ్మించి మోసం.. నిందితుల అరెస్ట్!

  • విశాఖ నగరంలో ఘరానా మోసం గుట్టురట్టు!
  • ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ మోసం
  • మోసపోయిన పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు
విశాఖ నగరంలో ఘరానా మోసం గుట్టురట్టయింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు విష్ణుమూర్తి, మరో ముగ్గురు నిందితులు జయకృష్ణ, తరుణ్ కుమార్, జగదీశ్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.

స్కైప్ కాల్స్, వాట్సప్ మెస్సేజ్ ల ద్వారా నిందితులు డబ్బు వసూలు చేసుకున్నారని పోలీసులు చెప్పారు. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుల వ్యక్తిగత కార్యదర్శులు మాట్లాడినట్టుగా వీరు నమ్మించి మోసానికి పాల్పడ్డారని తెలిపారు. తాము మోసపోయామని తెలుసుకున్న పలు పార్టీల నేతలు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.5.8 లక్షలు, 28.22 గ్రాముల బంగారంతో పాటు ఐదు సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ సంబంధిత పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Andhra Pradesh
Vizag
jagan
Chandrababu

More Telugu News