Director: అదృశ్యమయ్యారనుకున్న దాసరి ప్రభు ఆచూకీ లభ్యం

  • నిన్న హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన ప్రభు
  • పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ
  • ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్లారన్న విషయమై ఆరా
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు
కొన్ని రోజులుగా అదృశ్యమైనట్టు అందరూ భావించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నిన్న హైదరాబాద్ లోని తన నివాసానికి ప్రభు చేరుకున్నారు. తారక ప్రభు అదృశ్యమయ్యారంటూ ఆయన మామ సురేంద్ర ప్రసాద్ ఈ నెల 9న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇంటికి చేరుకున్న ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కటుంబసభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా, ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన తారక ప్రభు చిత్తూరు బస్సు ఎక్కినట్టు సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు గుర్తించారు.  
Director
Dasari narayana rao
Elder son
prabhu

More Telugu News