sarfaraj: సర్ఫరాజ్ కు ఫోన్ చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్

  • భారత్ పై ఘోరంగా ఓడిపోయిన పాక్
  • కెప్టెన్ సర్ఫరాజ్ కు బోర్డు అండ
  • ఓటమికి కుంగిపోవద్దంటూ సూచన
ప్రపంచకప్ లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఆ జట్టుపై ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ పై ఇంటా బయటా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అండగా నిలిచింది. సర్ఫరాజ్ కు పాక్ చీఫ్ సెలెక్టర్ ఇషాన్ మణి ఫోన్ చేసి మాట్లాడారని పాక్ కు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. భారత్ తో ఓటమికి కుంగిపోవద్దని... తదుపరి జరగబోయే మ్యాచ్ లపై దృష్టి సారించాలని మణి సూచించారు. మీడియాలో ప్రసారమయ్యే వార్తలను పట్టించుకోవద్దని చెప్పారు. పాక్ సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయని... ఇతర విషయాలను పట్టించుకోకుండా ఆటపై ధ్యాస పెట్టాలని సూచించారు.
sarfaraj
pakistan
pcb

More Telugu News