Andhra Pradesh: ఇద్దరు, ముగ్గురు నేతలు నాకు ఫోన్ చేసి తమ పార్టీలోకి రమ్మన్నారు.. నేను వాళ్లకు ఒకటే చెప్పా!: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • మేం బీజేపీలో చేరడం లేదు
  • కష్టకాలంలో కార్యకర్తలను విడిచిపెట్టబోం
  • అనంతపురంలో మీడియాతో టీడీపీ నేత
జేసీ కుటుంబం టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనకు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందని ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి సైతం ధ్రువీకరించారు. తాజాగా ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము టీడీపీని వీడుతున్నామన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలిపారు. కష్టకాలంలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.

బీజేపీలో తాము చేరడం లేదని స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా కార్యకర్తలు తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా నిలవడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీలో చేరాలని తనను ఇద్దరు, ముగ్గురు నేతలు ఫోన్లు చేసి అడిగారనీ, ‘నాకు పదవులు అవసరం లేదు. నా కార్యకర్తల కోసమే రాజకీయాల్లో ఉన్నా’ అని వారికి స్పష్టం చేసినట్లు చెప్పారు.
Andhra Pradesh
Telugudesam
jc prabhakar reddy
YSRCP
BJP

More Telugu News