Andhra Pradesh: అక్రమ సంబంధం ఎఫెక్ట్.. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో మరిదిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వదిన!

  • విజయవాడలోని సనత్ నగర్ లో ఘటన
  • తోటికోడలు అనుకుని ఆడపడుచు హత్య
  • అక్కడికక్కడే మహిళ మృతి, కొనప్రాణాలతో ప్రియుడు
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిది, పెళ్లి అయ్యాక తనను దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ మహిళ భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దుర్ఘటనలో భార్య చనిపోగా, భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఈరోజు ఈ దారుణం చోటుచేసుకుంది.

విజయవాడలోని సనత్ నగర్ లో ఖలీల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో వదిన ముంతాజ్ తో ఖలీల్ కు అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే 3 నెలల క్రితం మరో యువతిని ఖలీల్ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ముంతాజ్ దగ్గరకు వెళ్లడం మానేశాడు. దీంతో ఖలీల్ పై పగ పెంచుకున్న ముంతాజ్ భార్యాభర్తలను చంపేయాలని నిర్ణయించుకుంది. అనంతరం ఓ బాటిల్ నిండా పెట్రోల్ తీసుకుని ఖలీల్ ఇంటికి చేరుకుంది.

అయితే అన్నను చూసేందుకు సోదరి హుజున్ని ఖలీల్ ఇంటికి వచ్చింది. వదిన, అన్నలతో ఇంట్లో కూర్చుని మాట్లాడుతోంది. అయితే ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చిన ముంతాజ్ తన తోటికోడలు అనుకుని హుజున్నీపై, అలాగే ఖలీల్ పై పెట్రోల్ చల్లింది. వారు తేరుకునేలోగానే నిప్పంటించింది. దీంతో మంటల్లో కాలిపోయి హుజున్నీ అక్కడికక్కడే చనిపోగా, ఖలీల్ కు 80 శాతం కాలిన గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అంబులెన్సులో ఖలీల్ ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి ముంతాజ్ ను అరెస్ట్ చేశారు.
Andhra Pradesh
Vijayawada
extra martial affair
Police

More Telugu News