Andhra Pradesh: గుంటూరులో టీడీపీ మద్దతుదారులకు వేధింపులు.. ఇళ్లకు వెళ్లేదారిలో అడ్డంగా గోడ నిర్మాణం!

  • ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన టీడీపీ సానుభూతిపరులు
  • గోడ నిర్మాణం ఆపేయాలని పోలీసుల ఆదేశం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలోని పొనుగుపాడు గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు ఈరోజు పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ నేతలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు.

తమ ఇళ్లకు వెళ్లే రహదారిపై అడ్డంగా రోడ్డును నిర్మిస్తూ దారి లేకుండా చేస్తున్నారనీ, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని ఫిరంగిపురం పోలీసులను కోరారు. దీంతో స్పందించిన పోలీసులు వైసీపీ నేతలు, మద్దతుదారులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. గోడ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశంతో పొనుగుపాడులో గోడ నిర్మాణాన్ని వైసీపీ నేతలు ఆపేశారు.
Andhra Pradesh
Guntur District
Telugudesam
YSRCP
harassment
Police
wall
construction

More Telugu News