raj tarun: కుర్రహీరో కొత్త సినిమా లాంచ్

  • కథల ఎంపికపై శ్రద్ధపెట్టిన రాజ్ తరుణ్
  •  సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్
  •  వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్    
వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, కొత్తదనం వున్న కథలపైనే రాజ్ తరుణ్ దృష్టిపెట్టాడు. సరైన కథల ఎంపిక కోసం కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, దర్శకుడు విజయ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కె.కె.రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ ను తీసుకున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయిక గురించిన సమాచారంతో పాటు మిగతా విషయాలు త్వరలోనే తెలియజేయనున్నారు. కథల విషయంలో రాజ్ తరుణ్ తీసుకున్న శ్రద్ధ ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి. 
raj tarun

More Telugu News