Southafrika: నేడు ఓడిపోతే దక్షిణాఫ్రికా పక్కాగా ఇంటికే!

  • నేడు బర్మింగ్ హామ్ వేదికగా ఆసక్తికర పోరు
  • న్యూజిలాండ్ తో తలపడనున్న సౌతాఫ్రికా
  • అన్ని మ్యాచ్ లూ గెలిస్తేనే సెమీస్ అవకాశాలు
ఇంగ్లండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ లో బాగంగా బర్మింగ్ హామ్ వేదికగా, నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకూ ఓటమి ఎరుగని న్యూజిలాండ్ తో సౌతాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలన్న ఏకైక లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగనుంది.

కాగా, దక్షిణాఫ్రికాకు ఇది ఆరవ మ్యాచ్. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లాడిన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ లో గెలిచి, మరొకటి వర్షం వల్ల రద్దు కావడంతో 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నేడు న్యూజిలాండ్ తో మ్యాచ్ సహా చివరి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధిస్తేనే ఆ జట్టుకు సెమీస్ ఆశలుంటాయి. నేడు ఓటమి పాలైతే, టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా చెత్త రికార్డును మూటగట్టుకుంటుంది. ఎందుకంటే, కేవలం 3 పాయింట్లతోనే ఉన్న ఆ జట్టు, తన చివరి మూడు మ్యాచ్ లను గెలిచినా 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి. 
Southafrika
Newzeland
Cricket
World Cup

More Telugu News