Milind Dastane: ఆభరణాల దుకాణాన్ని దారుణంగా మోసం చేసిన మరాఠీ నటుడు... అరెస్ట్!

  • పుణెలో ఘటన
  • డబ్బు తరువాత ఇస్తానని ఆభరణాలు కొన్న దస్తానే
  • యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు
ప్రముఖ మరాఠీ నటుడు మలింద్ దస్తానే, తన భార్యతో కలిసి ఓ అభరణాల దుకాణాన్ని రూ. 25 లక్షలకు దారుణంగా మోసం చేసి, ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తన భార్య సయ్యాలీతో కలిసి, వజ్రపుటుంగరాన్ని, బంగారాన్ని కొనుగోలు చేయాలంటూ పుణెలోని పీఎన్ గాడ్గిల్ ఆభరణాల దుకాణానికి వెళ్లిన దస్తానే, డబ్బులు తరువాత ఇస్తానని చెప్పాడు.

పేరున్న వ్యక్తి కావడంతో అందుకు ఆభరణాల దుకాణం యజమాని అంగీకరించాడు. అయితే, ఆ డబ్బు చెల్లించడంలో దస్తానే విఫలం అయ్యాడు. తనకు ముంబైలో ఆస్తులు ఉన్నాయని, వాటిని విక్రయానికి పెట్టానని, అమ్మగానే వచ్చిన డబ్బు నుంచి తమకు చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదని చతుర్ శృంగి పోలీస్ స్టేషన్ ను పీఎన్ గాడ్గిల్ జువెల్లరీ స్టోర్ ఆశ్రయించింది. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దస్తానేపై ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసులు పెట్టి, జంటను అరెస్ట్ చేసి, కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరికి జూన్ 21 వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించడంతో జైలుకు తరలించారు.
Milind Dastane
Jewellery
Pune
Police
Fruad

More Telugu News