Vasireddy padma: ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ?
- వాసిరెడ్డి పద్మ పేరును దాదాపు ఖరారు చేసిన జగన్
- నేడో, రేపో అధికారిక ప్రకటన
- రెండేళ్ల పదవీ కాలం ఉండగానే నన్నపనేని రాజీనామా
వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు కీలక పదవి లభించింది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ప్రభుత్వం మారిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడా స్థానంలో పద్మను నియమించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఆమె పేరును ఇప్పటికే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉండగానే నన్నపనేని తన పదవికి రాజీనామా చేశారు. ఏపీలో టీడీపీ ఓడి వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత చైర్ పర్సన్‌గా తనను కొనసాగించే అవకాశం లేదని గ్రహించిన ఆమె పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.