Afghanistan: టార్గెట్ కొండంత.. ఆఫ్ఘన్ పోరాటం అంతంత!

  • 40 ఓవర్లలో ఆఫ్ఘన్ స్కోరు 3 వికెట్లకు 196 రన్స్
  • హస్మతుల్లా అర్ధసెంచరీ
  • ఇంగ్లాండ్ భారీ స్కోరు
ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో 398 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ నిదానంగా ఆడుతోంది. 40 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 196 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే 10 ఓవర్లలో 202 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లున్నా, ఓవర్ కి 20 పరుగుల రన్ రేట్ తో స్కోరుబోర్డు ముందుకు ఉరికించడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం హస్మతుల్లా షాహిది 63, అస్గర్ అఫ్ఘాన్ 43 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్లకు 397 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Afghanistan
England
Cricket

More Telugu News