Kumar: టిక్‌టాక్ కోసం స్టంట్ చేయబోయి ఆసుపత్రి పాలైన యువకుడు

  • పేరు తెచ్చుకోవాలనే కోరికతో సాహసాలు
  • స్టంట్ చేస్తూ గాయపడిన కుమార్
  • మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలు
రకరకాల వీడియోలతో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, పేరు తెచ్చుకోవాలనుకునే వారికి ఈ మధ్యకాలంలో టిక్‌టాక్ మంచి వేదికైంది. ఇందుకోసం కొందరు ఏమాత్రం వెనుకాడకుండా సాహసాలు చేస్తున్నారు. ఈ సాహసాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి.

ఈ క్రమంలో కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ కోసం ఓ స్టంట్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్ చేసిన కుమార్.. అది కాస్తా బెడిసి కొట్టడంతో మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కుమార్ బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Kumar
Famous
TikTok
Karnataka
Bengalore

More Telugu News