Chandrababu: చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారన్న ఆరోపణలు నిజం కాదు: ఏపీ డీజీపీ సవాంగ్

  • ఎన్నికల తర్వాత రాజకీయ దాడులు అవాస్తవం
  • శాంతిభద్రతలపై నిష్పాక్షికంగా ఉండాలని ఆదేశాలు 
  • ‘వీక్లీ ఆఫ్’ అనేది పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు
ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారన్న ఆరోపణలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ, ఆ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తవమని, శాంతిభద్రతలపై నిష్పాక్షికంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఇకపై ఇలాంటివి ఉండవని వ్యాఖ్యానించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులకు రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు కానుంది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీనిపై గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, ‘వీక్లీ ఆఫ్’ అనేది పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు అని అన్నారు. సీఎం జగన్ నిర్ణయంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.  
Chandrababu
Telugudesam
dgp
goutam sawang
jagan

More Telugu News