Narendra Modi: ఏకపక్ష నిర్ణయాలొద్దు.. అందరి అభిప్రాయాలు తీసుకోవాలి: మోదీని కోరనున్న చంద్రబాబు

  • మోదీ అధ్యక్షతన జమిలి ఎన్నికలపై సమావేశం
  • పార్టీ తరుఫున మోదీకి లేఖ రాయనున్న బాబు
  • పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశం
రేపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జమిలి ఎన్నికలపై సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తమ పార్టీ తరుఫున లేఖ రాయాలని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలకు తావుండకూడదని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని మోదీని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది.

న్యాయ నిపుణులతో పాటు రాజ్యాంగ నిపుణుల సలహాలు  తీసుకున్న మీదటే ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు లేఖలో కోరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేందుకుగాను తన నివాసంలో వారితో భేటీ అయ్యారు.
Narendra Modi
Chandrababu
Jamili Elections
Meeting
Letter

More Telugu News