petrol: ఇకపై సూపర్ మార్కెట్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు

  • షాపింగ్ మాల్స్ లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే అవకాశం
  • ప్రతిపాదన తీసుకురానున్న కేంద్ర పెట్రోలియం శాఖ
  • ఇంధనరంగంలో ప్రవేశించాలనుకునే కంపెనీలకు నిబంధనల సడలింపు
పెట్రోల్, డీజిల్ కేవలం పెట్రోల్ బంకుల్లో మాత్రమే కాకుండా ఇకపై సూపర్ మార్కెట్లలో కూడా లభ్యంకానుంది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ త్వరలోనే ఓ ప్రతిపాదనను తీసుకురానున్నట్టు సమాచారం. ఇది కార్యరూపం దాల్చితే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, వాణిజ్య సముదాయాల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే అవకాశం  లభిస్తుంది.

ఇదే సమయంలో ఇంధనరంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన కనీస వసతులను కూడా కేంద్రం సమకూరుస్తుంది. కనీస పెట్టుబడి రూ. 2 వేల కోట్లు, 30 లక్షల టన్నుల క్రూడాయిల్ కు బ్యాంకు గ్యారెంటీలు తదితర నిబంధనలను సడలించనున్నట్టు సమాచారం. 
petrol
diesel
sales
super markets

More Telugu News