Jagan: రేపు ఢిల్లీకి జగన్, కేటీఆర్.. ఇంకా నిర్ణయం తీసుకోని చంద్రబాబు!
'ఒకే దేశం.. ఒకేసారి ఎన్నికలు' విషయంపై చర్చించే నిమిత్తం ఢిల్లీలో రేపు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేపు వీరిద్దరూ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సమావేశానికి హాజరయ్యే విషయమై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.