suman shetty: నాకు తెలిసింది నటన మాత్రమే .. అవకాశాలు ఇవ్వండి: కమెడియన్ సుమన్ శెట్టి

  • కొత్తవాళ్ల పోటీ ఎక్కువైపోయింది
  • నటనపైనే ఆధారపడి బతుకుతున్నాము
  • దర్శక నిర్మాతలు ప్రోత్సహించాలి
తెలుగు తెరపై కమెడియన్ గా సందడి చేసిన వాళ్లలో సుమన్ శెట్టి ఒకరు. యువ కథానాయకుల స్నేహితుల పాత్రలను ఎక్కువగా చేసిన సుమన్ శెట్టికి ఈ మధ్య అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇదే విషయాన్ని గురించి ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించాడు.

"కొత్తవాళ్ల పోటీ ఎక్కువగా ఉండటం వలన, నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. నిజం చెప్పాలంటే నాకు నటన తప్ప మరొకటి తెలియదు. కెమెరా ముందు నటించడం తప్ప మరే పని చేయలేను. నటననే నమ్ముకుని .. ఇప్పటివరకూ దీనిపైనే ఆధారపడి బతికాము. నటుడిగా నాలో లోపాలేమైనా వుంటే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను. దర్శక నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించాలి" అని చెప్పుకొచ్చాడు.
suman shetty

More Telugu News