ఏపీకి చల్లని కబురు.. నేటి నుంచి వర్షాలు!
- నేడు రాష్ట్రంలోకి రుతుపవనాలు
- మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ
- వర్షాలు పడే ప్రాంతాల్లో బలమైన గాలులు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వాయువు మరింత బలపడుతోందని, దీనివల్ల మబ్బులు ఏర్పడి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, వానలు పడే సమయంలో గాలులు భారీగా వీస్తాయని పేర్కొన్నారు.