Cricket: ఆసక్తికరంగా మారిన బంగ్లా, వెస్టిండీస్ మ్యాచ్... గెలిపించేందుకు షకీబల్ పోరాటం

వెస్టిండీస్ తో టాంటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు గెలుపుదిశగా పయనిస్తోంది. ఆల్ రౌండర్ షకీబల్ హసన్ బ్యాటింగ్ నైపుణ్యంతో బంగ్లా జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓ దశలో 133 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లా టీమ్ షకీబల్ ధాటిగా ఆడడంతో కోలుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 33 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. షకీబల్ 95 పరుగులతో ఆడుతుండగా, లిట్టన్ దాస్ 40 పరుగులతో అద్భుతమైన సహకారం అందిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవాలంటే 17 ఓవర్లలో 84 పరుగులు చేయాలి. అంతకుముందు, వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Cricket

More Telugu News