Jagan: నారా లోకేశ్ కు కౌంటర్ ఇచ్చిన ఏపీ హోంమంత్రి సుచరిత

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో ఆందోళన వ్యక్తం చేయడంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఓ మహిళా అధికారిని కొట్టినా పట్టించుకోని పరిస్థితి ఉందంటూ బదులిచ్చారు.

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని సుచరిత మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఘర్షణల్లో టీడీపీ వర్గీయులు 44 మంది గాయపడ్డారని, అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు 57 మందికి గాయాలయ్యాయని, దీనికేమంటారని లోకేశ్ ను నిలదీశారు. సాక్షాత్తు జగన్ పై జరిగిన దాడిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఎం జగన్ స్పష్టం చేశారని ఆమె తెలిపారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh
Sucharitha

More Telugu News