Jagan: హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే జగన్ అక్కడికి కూడా వచ్చారు: స్వామి స్వరూపానందేంద్ర

  • శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలు
  • దీక్ష మహోత్సవానికి హాజరైన జగన్, కేసీఆర్
  • జగన్ గురించి మాట్లాడిన స్వామి
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఏపీ సీఎం జగన్ పై అపారమైన ప్రేమాభిమానాలు కురిపించారు. విజయవాడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఇవాళ జరిగిన శారదా పీఠం ఉత్తరాధికారి నియామక కార్యక్రమానికి జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, శారదా పీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మను నియమిస్తామని జగన్ కు నాలుగేళ్ల కిందటే చెప్పామని తెలిపారు. ఆ సమయంలో తాను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే, జగన్ అంతదూరం తనకోసం వచ్చారని స్వామి గుర్తుచేసుకున్నారు. ఉత్తరాధికారి గురించి హిమాలయాల్లో ఉన్నప్పుడే జగన్ కు చెప్పినట్టు వెల్లడించారు. ఏపీలో జగన్ గెలుస్తాడని తమకు ముందుగానే తెలుసని, ఆ విషయం తమ శారదా పీఠం ముందే చెప్పిందని కూడా స్వరూపానందేంద్ర వివరించారు.
Jagan
KCR
Swami Swarupanandendra

More Telugu News