vh: కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారు: వీహెచ్

  • కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అవకాశవాది
  • కాంగ్రెస్ నుంచి ఆయన వెళ్లిపోతేనే మంచిది
  • రాహుల్ అధినేతగా ఉంటేనే పార్టీకి బలం
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. గెలిస్తే నాదే విజయమని చెప్పుకునే కోమటిరెడ్డి... ఓడిపోతే మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలపై నిందలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇంత చేస్తున్నా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలాంటి అవకాశవాది... కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతేనే మంచిదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఓటమిలో తమ అధినేత రాహుల్ గాంధీ వైఫల్యం లేదని... సలహాదారులు ఆయనను తప్పుదోవ పట్టించారని వీహెచ్ ఆరోపించారు. రాహుల్ అధినేతగా ఉంటేనే పార్టీకి బలమని... ఆయనే పార్టీని ముందుండి నడిపించాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చేవారిని, భజనపరులను రాహుల్ పక్కన పెట్టాలని సూచించారు. అవకాశవాదులు పోతేనే పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని దుయ్యబట్టారు.
vh
komatireddy
congress
bjp
Rahul Gandhi

More Telugu News