జగన్ ఇంటికి చేరుకున్న కేసీఆర్.. ఘనంగా స్వాగతం పలికిన ఏపీ ముఖ్యమంత్రి!
- పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన జగన్
- కేసీఆర్ ను ఆశీర్వదించిన వేదపండితులు
- కేసీఆర్ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన జగన్
ఈ సందర్భంగా జగన్ తో సమావేశమైన కేసీఆర్ ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఏపీ సీఎంను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ ఆహ్వానంపై ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సందర్భంగా కొందరు వేదపండితులు కేసీఆర్ ను ఆశీర్వదించారు.

