India: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నా!: రాహుల్ గాంధీ

  • వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలిచా
  • ఈరోజు సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నా
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
వరుసగా నాలుగోసారి తాను లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక అయ్యానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తన పదవీకాలం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ సీటు నుంచి గెలుపొందిన తాను పార్లమెంటులో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నానని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం తాను లోక్ సభలో భారత రాజ్యాంగం సాక్షిగా ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తానని అన్నారు.

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకు పరిమితమయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అమేథీ(యూపీ), వయనాడ్(కేరళ) నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. వయనాడ్ లో మాత్రం 4.31 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.
India
Congress
Rahul Gandhi
Twitter

More Telugu News