Andhra Pradesh: జగన్ అంటే నాకు భయం లేదు.. భయపడతానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారు!: జేసీ దివాకర్ రెడ్డి

  • బీజేపీలో చేరాలని ఆఫర్ వచ్చింది
  • అయితే ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు
  • జగన్ ఢిల్లీలో హుందాగా వ్యవహరించారు
  • అనంతపురంలో మీడియాతో టీడీపీ నేత
బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించారని టీడీపీ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నీతిఆయోగ్ సమావేశం నేపథ్యంలో ఢిల్లీలో పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ చాలా హుందాగా ప్రవర్తించారని జేసీ కితాబిచ్చారు. పులివెందుల నుంచి వచ్చిన జగన్ ఇలా ఉంటాడని తాము అనుకోలేదన్నారు.

అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. జగన్ కు భయపడి ఆయన్ను పొగడటం లేదనీ, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని జేసీ అన్నారు. తాను జగన్ కు భయపడుతున్నానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించుకుంటారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
Telugudesam
jc diwakar reddy

More Telugu News