Andhra Pradesh: అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు.. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిది!: గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు

  • గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద  తీర్మానం
  • అధికార-విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ
  • మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై గడికోట ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని ఓడించినా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఇంకా మారలేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.

ఏపీలో గత ఐదేళ్లు టీడీపీ పాలన దుర్మార్గంగా సాగిందని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం పనిచేసిందనీ, ఏ ప్రాజెక్టునూ పూర్తిచేయకపోగా, వేలకోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు టీడీపీ సభ్యులు భ్రమ పడుతున్నారనీ, దాని నుంచి బయటకు రావాలని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు సమాధానంగా శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. 
Andhra Pradesh
Telugudesam
YSRCP
achennaidu
gadikota srikanth reddy

More Telugu News