మమ్మల్ని ఇక్కడే తుంచేయెద్దు: హీరో సప్తగిరి
- 'వజ్రకవచధర గోవింద'పై సప్తగిరి స్పందన
- బి -సి సెంటర్లలో బాగానే ఆడుతోంది
- పది నిమిషాల నిడివి తగ్గించాము
ఈ వేదికపై సప్తగిరి మాట్లాడుతూ .. "మా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. స్కూళ్లు తెరవడం వలన ఆ ప్రభావం వసూళ్లపై పడిందని భావిస్తున్నాము. బి - సి సెంటర్లలో సినిమా బాగానే ఆడుతున్నందుకు ఆనందంగా వుంది. సెకండాఫ్ సాగతీతగా ఉందనే రిపోర్ట్ వలన 10 నిమిషాల నిడివిని తగ్గించడం జరిగింది. మీరంతా ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఇక్కడే మమ్మల్ని తుంచేస్తే ముందుకు వెళ్లలేం. మీరంతా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు.