AP Assembly: ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి ఎన్నిక రేపు.. నోటిఫికేషన్‌ జారీ చేసిన స్పీకర్‌ తమ్మినేని

  • ఉదయం 11 గంటలకు జరగనున్న ఎన్నిక
  • బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్‌
  • దీంతో ఎన్నిక లాంచనమే
ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ఉపసభాపతి (డిప్యూటీ స్పీకర్‌) ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే ఈ మేరకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ గురించి మాట్లాడిన అనంతరం సమావేశాలను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ ఎన్నిక కోసం ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా ఉప సభాపతి పదవికి గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేరును ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే  ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల రేపు ఉదయం ఆయన ఎన్నిక లాంఛనమే అని భావించవచ్చు.
AP Assembly
dy.speaker
tommoro election
kona raghupathi

More Telugu News