Jagan: మారిన జగన్ కాన్వాయ్... పాత కాన్వాయ్ హైదరాబాద్ కే పరిమితం!

  • గత నెలలో జగన్ కు కొత్త కాన్వాయ్
  • దాన్ని హైదరాబాద్ తరలించిన అధికారులు
  • ఆరు కొత్త ఫార్చ్యూనర్ వాహనాల కొనుగోలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ మారింది. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, జగన్ కు ప్రత్యేక కాన్వాయ్ ని సమకూర్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆ కాన్వాయ్ స్థానంలో ఆరు కొత్త ఫార్చ్యూనర్ వాహనాలతో జగన్ కాన్వాయ్ మారింది. ఈ మేరకు కొత్త వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే సమయంలో పాత కాన్వాయ్ ని హైదరాబాద్ కు చేర్చారు. ఇకపై జగన్ హైదరాబాద్ కు ఎప్పుడు వెళ్లినా ఇదే కాన్వాయ్ ని ఉపయోగిస్తారు. ఇకపై అమరావతిలో జగన్ కాన్వాయ్ లో ఆరు ఫార్చ్యూనర్ వాహనాలతో పాటు జామర్, అంబులెన్స్, పోలీసు ఎస్కార్ట్ వాహనాలు తదితరాలు ఉండనున్నాయి.
Jagan
Convoy
Hyderabad
Amaravati

More Telugu News