Sachin Tendulkar: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

  • వన్డేల్లో వేగంగా 11,000 పరుగులు
  • 222 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లీ ఘనత
  • సచిన్ కు 276 ఇన్నింగ్స్ లు!
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో వేగంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్రపుటల్లోకెక్కాడు. ఇంతక్రితం ఈ రికార్డు భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో 57 పరుగులు సాధించిన అనంతరం కోహ్లీ వన్డేల్లో 11,000 మైలురాయిని అందుకున్నాడు. 11 వేల పరుగులను కోహ్లీ 222 ఇన్నింగ్స్ ల్లో రాబట్టాడు. సచిన్ ఈ ఫీట్ సాధించేందుకు 276 ఇన్నింగ్స్ లు ఆడాడు.
Sachin Tendulkar
Virat Kohli
Cricket

More Telugu News