kodela sivaprasad: కోడెల శివప్రసాద్, తనయుడు శివరాంలపై కేసు నమోదు

  • రంజీ క్రికెటర్ కు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
  • నరసరావుపేటలో కేసు నమోదు
  • 420 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
రంజీ క్రికెటర్ నాగరాజు కు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేశారన్న ఆరోపణలపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్, తనయుడు కోడెల శివరామ్ లపై కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశారని నాగరాజు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. 420 తో పాటు 468,472, 477, 387 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్టు సమాచారం.
kodela sivaprasad
sivaprasad

More Telugu News