Sandeep Kishan: చాలా రక్తం పోయేసరికి అందరూ భయపడ్డారు: సందీప్ కిషన్

  • తెనాలి రామకృష్ణ షూటింగ్ లో ప్రమాదం
  • సందీప్ కిషన్ ఎడమకంటి వద్ద గాయం
  • చికిత్స పొందుతున్న హీరో
తెనాలి రామకృష్ణ చిత్రం షూటింగ్ లో హీరో సందీప్ కిషన్ గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై సందీప్ సోషల్ మీడియాలో స్పందించాడు. గ్లాస్ పేలిపోవడంతో ఎడమ కంటి కింది భాగంలో గాజు ముక్కలు గుచ్చుకున్నాయని తెలిపాడు. స్టంట్ మ్యాన్ కు మరింత లోతైన గాయం అయిందని, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. గ్లాస్ పేలుడు సీన్ లో పేలుడు సందర్భంగా ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని, ఎడమ కంటి వద్ద గాయం కావడంతో చాలా రక్తంపోవడంతో సెట్స్ మీద అందరూ భయడిపోయారని సందీప్ కిషన్ తెలిపాడు. ఇప్పుడు తన పరిస్థితి బాగానే ఉందని వెల్లడించాడు. అవుట్ డోర్ షూటింగ్ లో ఈ ప్రమాదం జరగ్గా, మెరుగైన చికిత్స కోసం సందీప్ కిషన్ ను హుటాహుటీన హైదరాబాద్ తరలించారు.
Sandeep Kishan
Tollywood

More Telugu News